రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- May 10, 2026
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణలో పర్యటించారు. వరుసగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మోదీ తొలిసారి నేడు రాష్ట్రానికి వస్తుండటం రాజకీయంగా కీలకంగా మారింది. నేటి పర్యటనలో మోదీ రాష్ట్రంలో రూ. 9 వేల కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేయనున్నారు. సుమారు 5 గంటలపాటు మోదీ నగరంలో పర్యటించనున్నారు.
హైదరాబాద్ చేరుకున్న మోదీ…HICCలో వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు.ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దపీట వేశారు. మౌలిక సదుపాయాలు, ఇంధన, రవాణా రంగాలకు సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిల్లో ముఖ్యమైన ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
- హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌తో పాటు NH-167లో గుడెబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 4 వరుసల రహదారి పనులకు ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ విలువ 3,175 కోట్ల రూపాయలు అని సమాచారం.
- ఆ తర్వాత జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. 2,360 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేశారు.
- 1,243 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ మూడో రైల్వే లైన్ పనులు వర్చువల్ గా ప్రారంభించారు.
- వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్క్ ప్రారంభం.
- హైదరాబాద్ మల్కాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ ప్రారంభం
అనంతరం మోదీ మాట్లాడుతూ.. హైదరాబాద్ తెలంగాణకే కాదు దేశానికి కూడా కీలకం. దేశ అభివృద్ధిలో సైబరాబాద్ ది ప్రధాన పాత్ర. సైబరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్ ను తీర్చిదిద్దుతున్నాం. సైబరాబాద్ అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు కేటాయించింది. ఈ కొత్త ప్రాజెక్టులతో తెలంగాణను ప్రపంచంతో కనెక్ట్ చేయడమే కాక.. ఉద్యోగ కల్పన చేస్తున్నాం. అభివృద్ధిలో జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కీలకం. పదేళ్లలో జాతీయ రహదారులను అభివృద్ధి చేశాం. రూ. 1.75 లక్షల కోట్లతో దేశంలో కనెక్టివిటీ పెంచుతున్నాం అని తెలిపారు.
తెలంగాణ రైల్వే బడ్జెట్ ను కూడా రూ.5,500 కోట్లకు పెంచాం.తెలంగాణకు 5 వందే భారత్, 6 అమృత భారత్ రైళ్లు కేటాయించాం. కాజీపేట రైల్వే జంక్షన్ ని అభివృద్ధి చేస్తున్నాం అని తెలిపారు.
తాజా వార్తలు
- రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన ప్రధాని మోదీ
- రిజర్వేషన్లు ఉన్నా..బోర్డింగ్ నిరాకరణ.. 114 ఫిర్యాదులు..!!
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- లైసెన్సు లేకుండా బైక్ నడిపిన టీనేజర్ అరెస్టు..!!
- కొత్తగా వచ్చే కార్మికుల కోసం వైద్య పరీక్షలు..!!
- మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన వ్యవస్థలు..!!
- మక్కాలో 18 మంది పాకిస్థానీలు, ఆఫ్ఘన్లు అరెస్టు..!!
- నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్.. ఇద్దరు మహిళలకు 7 లక్షల దిర్హమ్ల జరిమానా..!!
- దోహా తీరంలో నౌకపై క్షిపణి దాడి
- సీఎంగా రెండోసారి హిమంత్ బిశ్వశర్మ









