కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- May 13, 2026
కువైట్: కుటుంబ స్థిరత్వాన్ని, సామాజిక భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన కువైట్ తొలి ప్రభుత్వ ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందని సామాజిక వ్యవహారాలు, కుటుంబ, బాల్య వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అమ్తల్ అల్-హువైలా ప్రకటించారు. కుటుంబ, బాలల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ఉమ్మడి ప్రయత్నాలకు ఈ కార్యక్రమం నిదర్శనమని అల్-హువైలా తెలిపారు.
సామాజిక, న్యాయ, ఆరోగ్య, విద్యా, భద్రతా వ్యవహారాలకు సంబంధించిన ఏజెన్సీలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. కుటుంబ రక్షణ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, చట్టాలు మరియు విధానాలను అప్డెట్ చేయడం..అలాగే అవగాహన మరియు మానసిక, సామాజిక పునరావాస కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నాయని అల్-హువైలా తెలిపారు. కుటుంబ రక్షణ అనేది ఒక జాతీయ ప్రాధాన్యతగా ఉందని చెప్పారు. కువైట్ సామాజిక అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా కుటుంబ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!







