తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- May 13, 2026
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్ష నెగ్గింది. బుధవారం ఉదయం ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విజయ్ ప్రభుత్వానికి 144 మంది సభ్యులు మద్దతు పలికారు. 22 మంది సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలిపాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే సభ నుంచి వాకౌట్ చేశాయి. విజయ్ ప్రభుత్వానికి అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. కొద్దిసేపటికి మొత్తంగా అన్నాడీఎంకే పార్టీలోని షణ్ముగం నేతృత్వంలోని 30మంది ఎమ్మెల్యేలు కూడా బయటి నుంచి మద్దతు ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వం బలపరీక్ష నెగ్గినట్లు జేసీడీ ప్రభాకర్ ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE







