బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- May 13, 2026
అక్రమ పశువుల రవాణాపై కఠిన చర్యలు: తెలంగాణ పోలీస్
హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, సామరస్య వాతావరణం కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి కె.ఇలంబర్తి, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రస్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని జిల్లాల అధికారులతో డీజీపీ ఆనంద్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, రెవెన్యూ, MA&UD, పశుసంవర్ధక శాఖ ఫీల్డ్ అధికారులు పాల్గొన్నారు.
అక్రమ పశువుల రవాణా పై ప్రత్యేక నిఘా
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశాల ఆదేశాల మేరకు బక్రీద్ సమయంలో అక్రమ పశువుల రవాణా, స్మగ్లింగ్‌పై కఠిన నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర సరిహద్దుల్లోని 52 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు తెలంగాణవ్యాప్తంగా 203 చెక్‌పోస్టుల్లో అనుమానాస్పద వాహనాలపై పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు.
రవాణా వాహనాల తనిఖీలు, ధ్రువపత్రాల పరిశీలన, పశువుల సంతలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
చట్టాల అమలులో రాజీ లేదు
గోవధ నిషేధ చట్టం, జంతువుల రవాణా నిబంధనలు, జంతు క్రూరత్వ నిరోధక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ఈ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం పై హెచ్చరిక
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, విద్వేషపూరిత పోస్టులు, ఉద్రిక్తతలకు దారితీసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సామరస్య వాతావరణానికి చర్యలు
అన్ని జిల్లాల్లో కమ్యూనిటీ ప్రతినిధులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు సూచనలు జారీ చేశారు. అపోహలు తొలగించి సామరస్య వాతావరణంలో బక్రీద్ వేడుకలు జరగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ పోలీస్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉందని, బక్రీద్ పండుగను సామరస్యపూర్వకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం..ఉత్తర్వులు జారీ
- రియాద్‌లో ఉచిత హృదయ వైద్య శిబిరం
- అస్వస్థతతో సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరిక..
- బక్రీద్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా: డీజీపీ ఆనంద్
- ఇరాన్‌కు అమెరికా ఆర్థిక షాక్: రూ.145 కోట్ల బహుమతి ప్రకటన!
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (BSG)ను మరింతగా విస్తరించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దుబాయ్‌లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!









