మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు

- May 13, 2026 , by Maagulf
మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు

మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు భారీ స్పందన

 ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026కు అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా 30 రోజులు మిగిలి ఉండగానే టికెట్ అమ్మకాలు 1.45 లక్షలు దాటాయి. ఈ టోర్నమెంట్ చరిత్రలోనే ఇది అత్యధిక టికెట్ అమ్మకాలుగా ఐసీసీ ప్రకటించింది. బర్మింగ్‌హామ్‌లో జరిగే ఇంగ్లాండ్-శ్రీలంక ప్రారంభ మ్యాచ్‌కు ఇప్పటికే మంచి డిమాండ్ కనిపిస్తోంది.

గత రికార్డులు బద్దలు
ఐసీసీ ప్రకారం 2020లో ఆస్ట్రేలియాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ మొత్తం టోర్నమెంట్‌కు 1,36,549 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. కానీ 2026 టోర్నమెంట్‌కు ప్రారంభానికి ముందే 1.45 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఐసీసీ పేర్కొంది.

12 జట్లు.. 7 వేదికలు
ఈసారి టోర్నమెంట్‌లో ప్రపంచంలోని టాప్ 12 జట్లు పాల్గొననున్నాయి. ఇంగ్లాండ్, వేల్స్‌లోని ఏడు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జూన్ 6 నుంచి 10 వరకు కార్డిఫ్ సోఫియా గార్డెన్స్, డెర్బీ కౌంటీ గ్రౌండ్, లాఫ్‌బరో యూనివర్సిటీలో వార్మప్ మ్యాచ్‌లు జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com