బాలయ్య సినిమాలో ‘హనీ రోజ్’ రీఎంట్రీ

- May 13, 2026 , by Maagulf
బాలయ్య సినిమాలో ‘హనీ రోజ్’ రీఎంట్రీ

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ (NBK 111) సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మీనాక్షి’ పాత్ర, ‘సుగుణ సుందరి’ సాంగ్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సందడి చేశాయో అందరికీ తెలిసిందే. బాలయ్య సరసన హనీ రోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ పర్‌ఫెక్ట్‌గా ఉండటంతో, మరోసారి ఆ సక్సెస్ ఫుల్ కెమిస్ట్రీని వెండితెరపై ఆవిష్కరించేందుకు గోపీచంద్ మలినేని సిద్ధమయ్యారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఒక భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ పేరు కూడా వినిపిస్తోంది. హనీ రోజ్ ఎంట్రీతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. 2026 ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు వేగవంతం కాగా, గోపీచంద్ తన మార్కు మాస్ ఎలిమెంట్స్‌తో బాలయ్యను వెండితెరపై పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు. బాలయ్య-గోపీచంద్ కాంబో అంటేనే మాస్ ఎలివేషన్లకు పెట్టింది పేరు. దీనికి తోడు హనీ రోజ్ తోడవడంతో థియేటర్లలో మరోసారి పూనకాలు గ్యారెంటీ అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామాలో బాలయ్య లుక్, డైలాగ్స్ సరికొత్తగా ఉంటాయని చిత్ర బృందం హింట్ ఇస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com