‘హ్యాపీ జర్నీ’ టీమ్ పై నటి సునయన ఆవేదన
- May 15, 2026
టాలీవుడ్ నటి సునయన సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ జర్నీ’. బుధవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అయితే, పోస్టర్లో ఇతర నటీమణుల ఫోటోలు ఉన్నప్పటికీ, తన ఫోటో లేకపోవడంపై సునయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
షూటింగ్లో షాపింగ్‌కు వెళ్తే పోస్టర్ నుంచి తీసేస్తారా?
ఈ విషయం పై ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన సునయన.. చిత్ర యూనిట్‌ను సూటిగా ప్రశ్నించారు. “ఇది నిజంగా నాకు షాకింగ్‌గా అనిపిస్తోంది. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు గ్యాప్ దొరికితే షాపింగ్‌కు వెళ్లడం సహజం. కేవలం అంత మాత్రానికే పోస్టర్లో నా ఫోటో లేకుండా చేస్తారా?” అని ఆమె నిలదీశారు.
ఇంట్లో వాళ్లు అడుగుతుంటే బాధగా ఉంది.. “పోస్టర్లు, టీజర్లు అనేవి ఏ నటికైనా చాలా ముఖ్యం. పోస్టర్లో నువ్వు లేవేంటి అని ఇంట్లో వాళ్లు అడుగుతుంటే చాలా బాధగా అనిపించింది. నేను సాధారణంగా ఇలాంటి విషయాలు అడిగే వ్యక్తిని కాదు, కానీ ఇది నాకు అన్యాయం అనిపించి మాట్లాడుతున్నాను” అని సునయన ఎమోషనల్ అయ్యారు.ఈ ప్రయాణం తనకు ఎంతో నేర్పించిందని పేర్కొన్న సునయన, దర్శకుడు అభిరామ్ నాయుడు దీని పై ఏమంటారో చూడాలని ట్యాగ్ చేశారు. దీనిపై చిత్ర బృందం ఇంకా స్పందించాల్సి ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







