పీ-8ఐ యుద్ధ విమానాల భారీ నిర్వహణ కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–బోయింగ్ డిఫెన్స్ ఇండియా ఒప్పందం
- May 15, 2026
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ విమాన నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్‌హాల్ (MRO) సంస్థ జీఎంఆర్ ఏరో టెక్నిక్ (GAT) మరియు బోయింగ్ డిఫెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (BDIPL) మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత నౌకాదళానికి చెందిన పీ-8ఐ సముద్ర గస్తీ యుద్ధ విమానాల కోసం “ఫేజ్-56 హెవీ మెయింటెనెన్స్ చెక్స్” నిర్వహించేందుకు ఈ ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్ ఎస్ఈజెడ్‌లో ఉన్న ఆధునిక MRO కేంద్రంలో పీ-8ఐ విమానాలకు భారీ స్థాయి నిర్వహణ పనులు చేపట్టనున్నారు. ఇందులో నిర్మాణాత్మక అప్‌గ్రేడ్లు, సమగ్ర తనిఖీలు, పెయింటింగ్, సిస్టమ్ అప్‌గ్రేడ్లు వంటి పనులు బోయింగ్ మరియు రక్షణ విమానయాన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించబడతాయి.
ఈ సందర్భంగా జీఎంఆర్ ఏరో టెక్నిక్ అధ్యక్షుడు అశోక్ గోపీనాథ్ మాట్లాడుతూ, బోయింగ్‌తో ఇప్పటికే ప్యాసింజర్ టు ఫ్రైటర్ మార్పిడి వంటి విజయవంతమైన ప్రాజెక్టుల ద్వారా ఏర్పడిన భాగస్వామ్యం ఇప్పుడు రక్షణ రంగంలో మరింత బలపడిందన్నారు. భారత రక్షణ రంగానికి సంబంధించిన ప్రముఖ యుద్ధ విమాన వేదికకు మద్దతు అందించడం తమకు గర్వకారణమని చెప్పారు.
భారతదేశాన్ని ప్రపంచ స్థాయి డిఫెన్స్ MRO హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఈ ఒప్పందం కీలక ముందడుగని ఆయన పేర్కొన్నారు. క్లిష్టమైన సైనిక విమానాల నిర్వహణలో విశ్వసనీయ సేవలందించే సంస్థగా జీఎంఆర్ ఏరో టెక్నిక్ నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
బోయింగ్ డిఫెన్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నిఖిల్ జోషి మాట్లాడుతూ, భారత రక్షణ దళాల మిషన్ సిద్ధతకు మద్దతు ఇవ్వడం బోయింగ్‌కు అత్యంత ప్రాధాన్యమని అన్నారు. పీ-8ఐ విమానాల ఫేజ్-56 నిర్వహణలో జీఎంఆర్ ఏరో టెక్నిక్‌తో భాగస్వామ్యం భారత MRO రంగ అభివృద్ధికి తమ కట్టుబాటును చాటుతోందన్నారు.
భారతదేశంలో స్వదేశీ ఏరోస్పేస్ మరియు రక్షణ సామర్థ్యాల అభివృద్ధి కోసం బోయింగ్ నిరంతరం పెట్టుబడులు పెడుతోందని, సేవలు, తయారీ, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యాలను విస్తరిస్తోందని చెప్పారు.
పీ-8ఐ విమానం దీర్ఘశ్రేణి సముద్ర గస్తీ మరియు గూఢచారి యుద్ధ విమానంగా గుర్తింపు పొందింది. జలాంతర్గాములపై యుద్ధం, సముద్ర భద్రత, నిఘా, సమాచార సేకరణ వంటి కీలక కార్యకలాపాల్లో ఈ విమానం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారత నౌకాదళం వద్ద 12 పీ-8ఐ విమానాలు ఉన్నాయి. ఇవి తమిళనాడులోని ఐఎన్‌ఎస్ రాజాలి మరియు గోవాలోని ఐఎన్‌ఎస్ హంస కేంద్రాల్లో మోహరించబడ్డాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







