పంజాబ్స్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం..
- May 15, 2026
పంజాబ్స్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. పంజాబ్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 రన్స్ టార్గెట్ ను ముంబై మరో బంతి మిగిలి ఉండగానే చేజ్ చేసింది. 6 వికెట్ల తేడాతో పంజాబ్ ను చిత్తు చేసింది. ముంబై బ్యాటర్లలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
33 బంతుల్లోనే 75 పరుగులు చేశాడు. 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. చివరి వరకు క్రీజులో నిలబడి ముంబై విజయంలో కీ రోల్ ప్లే చేశాడు తిలక్ వర్మ. ఈ టోర్నీ నుంచి ఇప్పటికే ముంబై నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు పంజాబ్ పరాజయాల పరంపర కంటిన్యూ అవుతోంది. పంజాబ్ కు ఇది వరుసగా 5వ పరాజయం. తొలుత ఓటమి అన్నది లేకుండా రాణించిన పంజాబ్.. ఇప్పుడు వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







