ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- May 16, 2026
యూఏఈ: మే 12న దుబాయ్ నుండి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయలుదేరిన 20 నిమిషాల లోపే, క్యాబిన్‌లో భయాందోళనలు వ్యాపించాయి. 32 ఏళ్ల ప్రయాణికుడు కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. ఆర్‌ఏకే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న అఖిలావ్యన్ నీలకందన్.. వెంటనే స్పందించారు. విమానంలో అందుబాటులో ఉన్న పరిమిత వైద్య సామాగ్రిని ఉపయోగించి, విమానం భారతదేశంలో సురక్షితంగా దిగే వరకు దాదాపు రెండు గంటల పాటు ఆమె అతడిని నిరంతరం పర్యవేక్షించారు.
నీలకందన్ తన మొదటి విహారయాత్ర కోసం ఇంటికి ప్రయాణిస్తున్నారు. ఆమె ప్రయాణిస్తున్నది కేవలం రెండవ విమాన ప్రయాణమే. ఆ సమయంలో దుబాయ్ నుండి తిరుచిరాపల్లికి వెళ్లే విమానంలో అత్యవసరంగా ఒక వైద్య నిపుణుడు అవసరమని క్యాబిన్ సిబ్బంది ప్రకటించారు.
“వైద్య సిబ్బంది లేదా వైద్యులు ఎవరైనా అందుబాటులో ఉన్నారా అని వారు ప్రకటించినప్పుడు నేను వెనుక కూర్చుని ఉన్నాను. నేను వెంటనే రోగి వద్దకు వెళ్లాను. నేను అతన్ని పిలిచినప్పుడు, అతను స్పందించలేదు. మూర్ఛ లాంటి లక్షణాలు కనిపించాయి. ఆ సమయంలో ప్రయాణికులు భయపడి నిలబడ్డారు. నేను భయపడలేదు. నేను ఆసుపత్రిలో ఉన్నట్లు భావించాను. ” అని ఆమె అన్నారు.
విమానంలో ఉన్న మరో డాక్టర్ సూచనలతో అతతినిక వైద్య సేవలు అందించామన్నారు. అతని నాడి తక్కువగా, బీపీ ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆ ప్రయాణికుడు తీవ్రంగా వణకడం కొనసాగించాడని ఆ నర్సు తెలిపారు. ఆ ప్రయాణికుడు మూర్ఛ లాంటి లక్షణాలతో పాటు తక్కువ షుగర్ లెవెల్స్ తో బాధపడుతున్నాడని తెలిపింది.
వెంటనే డాక్టర్ సూచనలతో ఎలక్ట్రోలైట్ సపోర్ట్ మరియు ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చామని, దీంతో నెమ్మదిగా, అతను కోలుకోవడం ప్రారంభించాడని తెలిపారు. కానీ అతని పరిస్థితిని నిలకడగా మార్చడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టిందన్నారు.
ప్రయాణికుడు స్పృహలోకి వచ్చిన తర్వాత, అతనికి జాగ్రత్తగా జ్యూస్ ఇచ్చి, ప్రయాణం మిగిలినంత సేపు అతని యోగక్షేమాలను పర్యవేక్షిస్తూనే ఉన్నట్లు నర్సు వెల్లడించారు. భారతదేశంలో విమానం దిగిన తర్వాత సిద్ధంగా ఉన్న అత్యవసర వైద్య బృందాల వద్దకు తీసుకెళ్లారు. విమానంలోని వైద్య అత్యవసర పరిస్థితి గురించి విమానయాన సంస్థ ముందే విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేసింది. విమానం దిగిన తర్వాత ఎయిర్ ఇండియా సిబ్బంది కూడా తమ అతిథికి ఆమె అందించిన సత్వర వైద్య సహాయానికి ధన్యవాదాలు తెలుపుతూ, చేతితో రాసిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు.
తాజా వార్తలు
- హయాకోమ్.. వరదల ఆందోళనలపై చర్చ..!!
- రియాద్ మెట్రో వెస్ట్రన్ స్టేషన్ ప్రారంభం..!!
- జనన, మరణ రిజిస్ట్రేషన్..వర్కింగ్ అవర్స్ ప్రకటించిన MoPH..!!
- సోషల్ మీడియాలో బంధువు ఫోటోలు పోస్ట్.. Dh3,000 ఫైన్..!!
- యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!
- ఫ్లైట్ లో ప్రయాణికుడిని రక్షించిన యూఏఈ నర్సు..!!
- మే 23 నుండి బెంగళూరు–ముంబై కొత్త రైలు ప్రారంభం!
- SRH vs RCB మ్యాచ్ టికెట్ల పేరిట కొత్త సైబర్ దందా.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!
- ఖైదీల విడుదల ఒప్పందాన్ని స్వాగతించిన ఒమన్..!!
- లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ప్రీమియం ప్యాకేజీలు ప్రారంభం..!!









