యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!

- May 16, 2026 , by Maagulf
యంగ్ లీడర్స్.. మస్కట్ లో జాతీయ కార్యక్రమం ప్రారంభం..!!

మస్కట్: యువ నాయకులను తయారుచేసే జాతీయ కార్యక్రమం "ఖియాదీ" (నాయకుడు) ప్రారంభమైంది. యంగ్ లీడర్స్ ప్రిపరేషన్ సెంటర్ సహకారంతో మస్కట్ గవర్నరేట్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో యువత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, వారి నాయకత్వ మరియు సృజనాత్మక సామర్థ్యాలను మెరుగుపరనున్నారు. 

అలాగే, సృజనాత్మక ఆలోచనలు, నిర్ణయం తీసుకోవడం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.  మూడు రోజుల కొనసాగే ఈ కార్యక్రమం 11 నుండి 14 సంవత్సరాల వయస్సు గల 60 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరిలో 40 మంది విద్యార్థులను మస్కట్ గవర్నరేట్‌లోని విద్యా డైరెక్టరేట్ జనరల్ నామినేట్ చేయగా, పబ్లిక్ రిజిస్ట్రేషన్ ద్వారా 20 మంది ఎంపికయ్యారు.  వీళ్లతోపాటు గవర్నరేట్ ఉద్యోగుల పిల్లల కోసం నిర్దిష్ట సంఖ్యలో సీట్లు కేటాయించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనేవారిలో సంపూర్ణ నాయకత్వ వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి రూపొందించిన ఆచరణాత్మక వర్క్‌షాప్‌లు మరియు ఇంటరాక్టివ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com