దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!
- May 17, 2026
దోహా: వరల్డ్ ఫ్యామిలీ డాక్టర్ డే ను పురస్కరించుకుని ఖతార్ రైల్వేస్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) సహకారంతో మే 18 నుండి 19తేదీలలో దోహా మెట్రోలోని అల్ సద్ (Al Sadd) స్టేషన్లో “జర్నీ టూవర్డ్ హెల్త్ (Journey Toward Health)” మూడో ఎడిషన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
దోహా మెట్రో నెట్వర్క్ అంతటా ప్రజలతో తమ అనుబంధాన్ని బలోపేతం చేసే వివిధ సామాజిక కార్యక్రమాలను అందించడమే ఈవెంట్ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. మెట్రో స్టేషన్లను వివిధ వర్గాల వారికి ఆకర్షణీయమైన కేంద్రాలుగా మరియు గమ్యస్థానాలుగా మార్చే నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఏడాది పొడవునా దోహా మెట్రో స్టేషన్లలో మెట్రో ఈవెంట్స్ నిర్వహిస్తున్నట్లు.. ఇందులో భాగంగా వివిధ రకాల పబ్లిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్ లో ప్రజలకు ఉచిత వైద్య సంప్రదింపులు మరియు పరీక్షలు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా, వినియోగదారులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించడానికి ఆసక్తికరమైన కార్యకలాపాలు, బహుమతులు మరియు అవగాహన పుస్తకాల పంపిణీ కూడా ఇందులో ఉందని తెలిపారు. అలాగే, మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఎడిషన్లో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన వైద్య సంప్రదింపులను కూడా అందించనున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!
- సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!
- ఆన్లైన్ లో వ్యాఖ్యల పై యూఏఈ వార్నింగ్.. Dh500,000 ఫైన్..!!
- దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!
- ఒమన్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ మెరుగు..!!
- ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO









