అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం

- May 17, 2026 , by Maagulf
అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం

అబుదాబి: అబుదాబిలోని బరాకా అణు విద్యుత్ కేంద్రం సమీపంలో డ్రోన్ దాడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై అబుదాబి అధికార యంత్రాంగం వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు ఎమిరేట్ మీడియా కార్యాలయం ఆదివారం వెల్లడించింది.

అల్ ధఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రం వెలుపల ఉన్న విద్యుత్ జనరేటర్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని స్పష్టం చేశారు.

అణు వికిరణ భద్రతపై ఎలాంటి ప్రభావం పడలేదని, కేంద్రంలోని ప్రధాన వ్యవస్థలు సురక్షితంగానే ఉన్నాయని ఫెడరల్ అథారిటీ ఫర్ న్యూక్లియర్ రెగ్యులేషన్ వెల్లడించింది. విద్యుత్ కేంద్రంలోని అన్ని యూనిట్లు సాధారణంగానే పనిచేస్తున్నాయని పేర్కొంది.

అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అధికారిక సమాచారం కాకుండా వదంతులను నమ్మవద్దని, ప్రజలు కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com