ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- May 17, 2026
మే 27న బక్రీద్ జరుపుకోనున్న ట్యునీషియా, టర్కీ
ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు ధుల్ హిజ్జా నెల చంద్రదర్శనంపై దృష్టి సారించిన వేళ, కొన్ని దేశాలు ఇప్పటికే ఈద్ అల్ అదా 2026 తేదీని అధికారికంగా ప్రకటించాయి. చంద్రుడు దర్శనమైతే సోమవారం (మే 18) నుంచి ధుల్ హిజ్జా నెల ప్రారంభమవుతుందని, తద్వారా మే 27న బక్రీద్ (ఈద్ అల్ అదా) జరుపుకోనున్నట్లు వెల్లడించాయి.
యూఏఈ ఖగోళ పరిశోధనా కేంద్రం ప్రకారం, మధ్య మరియు పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా, అమెరికా ఖండంలోని చాలా ప్రాంతాల్లో ధుల్ హిజ్జా చంద్రుడు కంటితోనే కనిపించే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు ఆసియా, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో టెలిస్కోప్ సహాయంతో చంద్ర దర్శనం సాధ్యమవుతుందని పేర్కొంది.
ట్యునీషియా తొలి ప్రకటన
ధుల్ హిజ్జా ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటించిన తొలి దేశంగా ట్యునీషియా నిలిచింది. మే 18, సోమవారం నుంచి ధుల్ హిజ్జా నెల ప్రారంభమవుతుందని, మే 27, బుధవారం ఈద్ అల్ అదా జరుపుకోనున్నట్లు ప్రకటించింది.
టర్కీ కూడా మే 27నే బక్రీద్
టర్కీ సంప్రదాయంగా చంద్ర దర్శనంపై ఆధారపడకుండా ఖగోళ గణనల ప్రకారమే ఇస్లామిక్ క్యాలెండర్ను అనుసరిస్తుంది. ఈ నేపథ్యంలో మే 18నే ధుల్ హిజ్జా మొదటి రోజు అని ప్రకటించింది. దీంతో మే 27న బక్రీద్ పండుగ జరుపుకోనుంది.
చంద్ర దర్శనం ఆధారంగా ఇతర దేశాలు కూడా తమ అధికారిక ప్రకటనలను విడుదల చేసే అవకాశం ఉంది. చంద్రుడు ఈ రాత్రే కనిపిస్తే మే 27న, లేకపోతే మే 28న ఈద్ అల్ అదా జరుపుకునే అవకాశం ఉందని మతపెద్దలు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!
- సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!
- ఆన్లైన్ లో వ్యాఖ్యల పై యూఏఈ వార్నింగ్.. Dh500,000 ఫైన్..!!
- దోహా మెట్రోలో జర్నీ టూవర్డ్ హెల్త్ ఈవెంట్..!!
- ఒమన్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ మెరుగు..!!
- ఎబోలాతో 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO









