ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- May 18, 2026
మస్కట్: సుల్తానేట్‌లో వినియోగదారుల ధరల సూచిక (CPI) ఏప్రిల్ 2026లో 3.2 శాతం పెరిగింది. దీంతో నిత్యవసర వస్తువులతోపాటు కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏప్రిల్ 2026లో కూరగాయల ధరలు 25 శాతం, పండ్లు 11.6 శాతం, చేపలు మరియు సముద్ర ఆహారం 6.1 శాతం పెరుగుదలను నమోదు చేశాయని జాతీయ గణాంకాలు మరియు సమాచార కేంద్రం (NCSI) తన నివేదికలో తెలియజేసింది.
అలాగే, మాంసం ధరలు కూడా 3.7 శాతం, ఆల్కాహాల్ రహిత డ్రింక్స్ ధరలు 3.4 శాతం పెరిగాయి.ఇక చక్కెర, జామ్, తేనె మరియు మిఠాయిల ధరలు 3 శాతం, పాలు, జున్ను (cheese) మరియు గుడ్ల ధరలు 2.5 శాతం, ధాన్యాల ధరలు 1.6 శాతం, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు 1.6 శాతం పెరిగాయి. కాగా, నూనెల ధరలు స్వల్పంగా 0.9 శాతం పెరిగాయి.
జనవరి నుండి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 2.6 శాతం పెరిగింది. వివిధ రకాల వ్యక్తిగత వస్తువులు మరియు సేవల సమూహం 9.2 శాతం పెరుగుదలను నమోదు చేయగా..ఆ తర్వాతి స్థానాల్లో ఆహారం మరియు మద్యరహిత పానీయాలు 6.2 శాతం, రవాణా సమూహం 6 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.రెస్టారెంట్లు మరియు హోటల్స్ 4.5 శాతం పెరుగుదలతో నాలుగవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గృహోపకరణాలు, ఇంటి నిర్వహణ సామాగ్రి 3 శాతం, విద్యా 2.2 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
ఆరోగ్య రంగానికి సంబంధించిన ధరలు 1.8 శాతం, వినోదం మరియు సంస్కృతి రంగానికి సంబంధించిన ధరలు 0.2 శాతం పెరిగాయి. కాగా, గృహనిర్మాణం, నీరు, విద్యుత్, గ్యాస్ మరియు ఇతర ఇంధనాలు, దుస్తులు మరియు పాదరక్షలు, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ధరలు మాత్రం స్థిరంగా కొనసాగాయి.
2026 ఏప్రిల్ చివరి నాటికి గవర్నరేట్‌ల మధ్య ద్రవ్యోల్బణ రేట్లలో వ్యత్యాసం ఉన్నట్లు డేటా వెల్లడించింది. అ’ధాహిరా గవర్నరేట్ 4.4 శాతం అత్యధిక పెరుగుదలతో జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, దాని తర్వాత అ’దఖిలియా మరియు మస్కట్ గవర్నరేట్‌లు 3.7 శాతంతో, ఆపై అల్ బురైమి గవర్నరేట్ 3.5 శాతంతో నిలిచాయి. అల్ వుస్తా గవర్నరేట్ 3 శాతం, ముసందమ్ గవర్నరేట్ 2.9 శాతం పెరుగుదలను నమోదు చేయగా, దక్షిణ అల్ బతీనా గవర్నరేట్‌లో పెరుగుదల రేటు 2.6 శాతానికి చేరుకుంది. ఉత్తర అషర్కియా మరియు దక్షిణ అషర్కియా గవర్నరేట్‌లు రెండూ 2.5 శాతం వద్ద నిలిచాయి. అదే సమయంలో, ఉత్తర అల్ బతీనా మరియు ధోఫర్ గవర్నరేట్‌లు రెండూ 1.9 శాతం పెరుగుదలను నమోదు చేశాయని NCSI తన నివేదికలో వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







