సౌదీ అరేబియాలో 5 హెల్త్ సెంటర్లు సీజ్, 130 సెంటర్లకు నోటీసులు..!!
- May 19, 2026
రియాద్ః సౌదీ అరేబియాలో నిబంధనలు పాటించని 5 హెల్త్ సెంటర్లు సీజ్ చేయడంతోపాటు 130 సెంటర్లకు నోటీసులు జారీచేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రియాద్, మదీనా మరియు అసిర్ తదితర ప్రాంతాలలో ఏప్రిల్ నెలలో దాదాపు 1500కు పైగా హెల్త్ సెంటర్లను తనిఖీలు చేపట్టినట్టు తెలిపింది. ముఖ్యంగా ఉల్లంఘనల్లో లైసెన్స్ లేకుండా వైద్యం చేయడం, సరైన లైసెన్సింగ్ లేకుండా నర్సింగ్ సిబ్బంది ద్వారా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియలను నిర్వహించడం వంటివి ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇతర ఉల్లంఘనలలో ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలకు సంబంధించిన లోపాలు మరియు అవసరమైన మందులు, వైద్య పరికరాల కొరత కూడా ఉన్నాయని పేర్కొంది.
పేషంట్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించింది. గతంలో మూసివేసిన కేంద్రాలలో సేవలు పొందిన లబ్ధిదారులకు మద్దతు ఇవ్వడానికి 937 అనే యూనిఫైడ్ నెంబర్ ను కేటాయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నంబర్ కు కాల్ చేయడం ద్వారా అవసరమైన వైద్య సంప్రదింపులతోపాటు వైద్య సహాయాన్ని పొందవచ్చని పేర్కొంది.ఇక నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలను మూసివేయడంతోపాటు SR100,000 వరకు జరిమానాలు, లైసెన్స్ లేని వైద్యులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించడం వంటివి ఉంటాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







