సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్ ప్రాజెక్టు.. కొత్తగా 7 కి.మీ. ప్రారంభం..!!
- May 21, 2026
మస్కట్: రవాణా, సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT), రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సహకారంతో దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లోని అల్ కామిల్, అల్ వాఫీ మరియు సుర్ విలాయత్‌ల మధ్య ఉన్న సుల్తాన్ తుర్కీ బిన్ సయీద్ రోడ్ లో భాగంగా కొత్తగా 7 కిలోమీటర్ల విభాగాన్ని ప్రారంభించింది.
కొత్తగా ప్రారంభించబడిన ఈ విభాగం మస్లాక్ నుండి మొదలై, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ శిబిరం సమీపంలోని సైహ్ అల్ మతార్ వరకు ఉంటుంది. ఇది అల్ కామిల్ మరియు అల్ వాఫీ నుండి వచ్చే వాహనదారుల కోసం సుర్ గేట్ గుండా వెళుతుంది. ఈ ప్రారంభోత్సవం ద్వారా ఈ మార్గంలో ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడి, రహదారి భద్రత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.
దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్‌లో రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుందన్నారు. విలాయత్‌ల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడంతోపాటు గవర్నరేట్‌లోని ఆర్థిక, పర్యాటక, అభివృద్ధి కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.
అలాగే, పెరుగుతున్న ట్రాఫిక్ డిమాండ్‌కు మరియు రవాణా మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌లో ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మించిన డ్యూయల్ క్యారేజ్‌వే నిర్మాణం ఉందన్నారు. ప్రతి దిశలో మూడు ట్రాఫిక్ లేన్‌లు ఉంటాయి. దీనితో పాటు అనేక ఫ్లైఓవర్‌లు, వాడీ క్రాసింగ్‌లు, సొరంగాలు, డ్రైనేజీ కల్వర్టులు కూడా ఉన్నాయి. సురక్షితమైన డ్రైవింగ్ వాతావరణాన్ని అందించడానికి రోడ్డు మార్కింగ్‌లతో సహా అవసరమైన అన్ని రహదారి భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







