ఖతార్‌లోని CBSE టాపర్లను సన్మానించిన ICC..!!
- May 21, 2026
దోహా: ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ ఆధ్వర్యంలో పనిచేసే 'ఇండియన్ కల్చరల్ సెంటర్' (ICC) వివిధ పాఠశాలలకు చెందిన 10వ మరియు 12వ తరగతి CBSE టాపర్లను సన్మానించింది. ICC అశోక హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఖతార్‌లోని భారత రాయబారి H.E. విపుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి, అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని శుభాకాంక్షలు తెలియజేశారు. వారిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చూపిన అంకితభావం, అందించిన సహకారాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ICC అధ్యక్షుడు A.P. మణికందన్, ప్రధాన కార్యదర్శి అబ్రహం కె. జోసెఫ్, ఉపాధ్యక్షుడు శాంతను దేశ్‌పాండే, సలహా మండలి ఛైర్మన్ P. N. బాబు రాజన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







