మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- May 21, 2026
అమరావతి: బక్రీద్(Eid-ul-Adha)సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 28వ తేది గురువారం సాధారణ సెలవు దినంగా ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిఓఆర్టీ సంఖ్య:1006 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.
బక్రీద్ పర్వదిన్నాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం గతంలో ఈనెల 27వ తేది బుధవారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది.
అయితే నెలవంక(Sighting of the moon)ఆధారంగా ముస్లిం సమాజం బక్రీద్ వేడుకను ఈనెల 27కు బదులుగా 28 గురువారం నిర్వహించు కోనునన్నారని విజయవాడ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ముఖ్య కార్య నిర్వహణాధికారి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు బక్రీద్ సాధారణ సెలవును ఈనెల 27కు బదులు 28వ తేదీ గురువారానికి మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సిఎస్ ఈఉత్తర్వులు జారీ చేశారు.
కావున ఈనెల 27వతేది బుధవారం సెలవును 28వతేది గురువారానికి మార్చడంతో 27వతేది బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ యదావిధిగా పని చేస్తాయని సిఎస్ సాయి ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అదే విధంగా షాపులు మరియు ఇతర ఎస్టాబ్లిష్మెంట్లకు సంబంధించి నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్ యాక్ట్ 1881 కు అనుగుణంగా బక్రీద్ సాధారణ సెలవును ఈనెల 27వ తేది బుధవారానికి బదులుగా 28వ తేది గురువారానికి మార్పు చేస్తూ జిఓఆర్టి సంఖ్య:1007 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు..
తాజా వార్తలు
- ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కొత్త పాలకవర్గం నియామక�
- IPL 2026: కోహ్లీ తర్వాత గిల్.. టీ20ల్లో కొత్త రికార్డు!
- అమెరికా-క్యూబా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- మే 28న బక్రీద్ సెలవు: ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ సాయి ప్రసాద్
- ఈద్ అల్ అధా సందర్భంగా 836 మంది ఖైదీలకు షేక్ మొహమ్మద్ క్షమాభిక్ష
- తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ ఏపీ పర్యటన విజయవంతం
- సరస్వతీ అంత్య పుష్కరాల్లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం
- ఆన్లైన్లో పోస్ట్ చేసే ముందు తెలుసుకోవాల్సిన యూఏఈ 10 కీలక మీడియా చట్టాలు
- ఏపీలో పర్యటిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై కమిటీ
- ఇండియాలో ఎబోలా అలర్ట్..









