ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉమ్మడి అరబ్ వైఖరి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- May 22, 2026
మనామా: ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఐక్య అరబ్ పార్లమెంటరీ వైఖరి కోసం బహ్రెయిన్ పార్లమెంటరీ గ్రూప్ పిలుపునిచ్చింది. మొరాకోలో జరిగిన అరబ్ స్కౌట్ యూనియన్ సమావేశంలో ఆ గ్రూప్‌లోని సభ్యుడైన ఎంపీ జలాల్ కధేమ్ ఈ మేరకు స్పష్టం చేశారు. మహారాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నాయకత్వంలో యువరాజు, ప్రధానమంత్రి అయిన మహారాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మార్గదర్శకత్వంలో.. బహ్రెయిన్ ఉమ్మడి అరబ్ కార్యాచరణను బలోపేతం చేయడానికి కృషి చేసిందని అన్నారు. మొరాకోలో జరిగిన అరబ్ స్కౌట్ యూనియన్ ఫర్ పార్లమెంటేరియన్స్ 18వ జనరల్ అసెంబ్లీ సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
జీసీసీ దేశాల అంతర్గత వ్యవహారాలలో ఇరాన్ జోక్యానికి వ్యతిరేకంగా ఐక్య వైఖరి కోసం మద్దతు కూడగట్టడానికి, బహ్రెయిన్ శాసనసభ పార్లమెంటరీ గ్రూప్, అంతర్జాతీయ సమావేశాలలో తనకున్న స్థానాన్ని ఉపయోగించుకుంటోందని మిస్టర్ కధేమ్ అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







