ఈద్ అల్ అదా..యూఏఈలో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..!!

- May 25, 2026 , by Maagulf
ఈద్ అల్ అదా..యూఏఈలో 48డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు..!!

యూఏఈః ఈద్ అల్ అదా సెలవులలో యూఏఈలో అత్యంత వేడిగా, తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో వేడిగా ఉంటాయని  నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది.  మే 25 నుండి మే 31 వరకు, రాత్రి వేళల్లో మరియు తెల్లవారుజామున వాతావరణ పరిస్థితులు సాధారణంగాఉంటాయని NCM తెలిపింది. అలాగే, వాతావరణం సాధారణంగా నిర్మలంగా ఉండి, కొన్ని తూర్పు ప్రాంతాల్లో అప్పుడప్పుడు పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది.

తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో 35ºC నుండి 43ºC మధ్య, ఉన్నత ప్రాంతాల్లో 43ºC నుండి 48ºC మధ్య, పర్వత ప్రాంతాల్లో 28ºC నుండి 35ºC మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, తీరప్రాంతాలు మరియు ద్వీపాలలో 24ºC నుండి 32ºC మధ్య, ఉన్నత ప్రాంతాల్లో 19ºC నుండి 27ºC మధ్య, పర్వత ప్రాంతాల్లో 24ºC నుండి 30ºC మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా.ఈ సందర్భంగా పగటిపూట నేరుగా సూర్యరశ్మికి గురికాకుండా ఉండాలని NCM ప్రజలకు సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com