లోక్‌సభ అంటే చిన్నచూపు తగదు: మొయిలీ
- August 08, 2016జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభించడం శుభపరిణామమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ బిల్లును ఆమోదించిన తర్వాత పార్లమెంటు ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు లోక్‌సభలో బిల్లుపై చర్చను కాంగ్రెస్ ఎంపీ వీరప్పమొయిలీ ప్రారంభించి మాట్లాడారు. బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. దీంతో ప్రధానిసహా అధికారపక్ష సభ్యులందరూ బల్లలపై చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. మొయిలీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ప్రజలపై భారం మోపకుండా పన్నురేటును తక్కువగా ఉంచాలని కేంద్రాన్ని కోరారు. దేశంలో ఆర్థికసంస్కరణలకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ అన్నారు. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాందీ పలికారని తెలిపారు. ఎన్డీయే సర్కార్ లోక్‌సభను చిన్నచూపు చూస్తోందన్నారు. గత ఏడాది లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందగానే తాము జాయింట్ సెలక్ట్ కమిటీ ఏర్పాటుకు పట్టుబట్టామని, కానీ కేంద్రం పట్టించుకోలేదన్నారు. వారం రోజుల క్రితం రాజ్యసభలో జాయింట్ సెలక్ట్ కమిటీ డిమాండ్ రాగానే అంగీకరించిందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







