అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- May 26, 2026
న్యూ ఢిల్లీ: మే 25న ఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, సెక్రటరీ మార్కో రూబియో భేటీ అయ్యారు. నేటితో ఈ పర్యటన ముగియనున్న నేపథ్యంలో, వీసా ప్రాసెసింగ్‌ను వేగవంతం చేయడంపై ఇద్దరు నేతలు చర్చించారు. ముఖ్యంగా భారతీయ టెక్ నిపుణుల వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. అలాగే, కొత్త సెషన్ ప్రారంభానికి ముందే ఎఫ్-1 (F-1) వీసా బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేయడంపై దృష్టి సారించారు. ఈ పరిణామం వీసా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. స్పెషాలిటీ ఆక్యుపేషన్ వీసా నిబంధనలు కఠినతరం కావడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. డాక్యుమెంటేషన్ రూల్స్ కఠినంగా ఉండటంతో భారతీయ ఐటీ నిపుణుల వీసా రిజెక్షన్ రేటు పెరుగుతోంది.
అయితే, అమెరికా ఆవిష్కరణలు, వృద్ధిలో భారతీయ టెక్కీల పాత్ర కీలకమని జైశంకర్ నొక్కి చెప్పారు. ఇరు దేశాల మధ్య విధానపరమైన సమన్వయం కుదిరితే టాలెంట్ పైప్‌లైన్ స్థిరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది కెరీర్ ప్లాన్ చేసుకునే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. రూబియో పర్యటన తర్వాత హెచ్-1బి (H-1B), ఎఫ్-1 (F-1) అభ్యర్థులకు కీలక అప్డేట్స్ ఫాల్ 2026 ప్రోగ్రామ్‌లకు సంబంధించి ఎఫ్-1 వీసా స్లాట్ల కొరతపై కూడా చర్చలు జరిగాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రధాన నగరాల్లో స్టూడెంట్ ఇంటర్వ్యూ స్లాట్లు దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై దరఖాస్తుదారులు అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. జూన్ నెలలో ఉండే రద్దీని తట్టుకోవడానికి అదనపు సిబ్బందిని నియమించాలని అధికారులు సూచించారు. సరైన సమయంలో చర్యలు తీసుకుంటే వేలాది మంది విద్యార్థులు తమ యూనివర్సిటీ ఓరియంటేషన్ మిస్ కాకుండా చూసుకోవచ్చు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







