ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- May 26, 2026
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ పురస్కారాల (Padma Awards 2026) మొదటి విడత ప్రదానోత్సవ వేడుక అత్యంత ఘనంగా ముగిసింది. వివిధ రంగాలలో అసాధారణ సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అవార్డులను అందజేశారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మొదటి విడతగా జరిగిన ఈ వేడుకలో ఇద్దరు పద్మవిభూషణ్, ఆరుగురు పద్మభూషణ్, మరియు 58 మంది పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 మందికి (5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ) అవార్డులను ప్రకటించగా.. మిగిలిన విజేతలకు రెండో విడతలో పురస్కారాలు అందజేయనున్నారు. ఈ ఏడాది పద్మశ్రీ జాబితాలో 45 మంది అన్సంగ్ హీరోలు (గుర్తింపునకు దూరంగా ఉండి సేవ చేసిన వారు) ఉండటం విశేషం.
తెలుగు రాష్ట్రాల పద్మ విజేతలు వీరే:
ఈ విడత అవార్డుల ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు:
- డాక్టర్ గూడూరు వెంకట్ రావు (వైద్యం – తెలంగాణ): గ్యాస్ట్రోఎంటరాలజీ రంగంలో విశేష సేవలకు గానూ పద్మ పురస్కారాన్ని అందుకున్నారు.
- డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం – తెలంగాణ): ప్రముఖ క్యాన్సర్ నిపుణులు (ఆంకాలజిస్ట్) అయిన ఈయన వైద్య రంగంలో చేసిన కృషికి పద్మ అవార్డు లభించింది.
- దీపికా రెడ్డి (కళలు – తెలంగాణ): కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డి కళల విభాగంలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
- వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం-విద్య – ఆంధ్రప్రదేశ్): సంస్కృత పండితుడైన ఈయనకు సాహితీ రంగానికి చేసిన సేవలకు గానూ పద్మ పురస్కారం లభించింది.
- దివంగత గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు – ఆంధ్రప్రదేశ్): ప్రముఖ అన్నమాచార్య సంకీర్తన విద్వాంసులు గరిమెళ్లకు మరణానంతరం పద్మ అవార్డు ప్రకటించగా, ఆయన కుమారుడు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ధర్మేంద్రకు పద్మవిభూషణ్..భావోద్వేగ క్షణాలు
బాలీవుడ్ లెజెండరీ నటుడు దివంగత ధర్మేంద్రకు ప్రకటించిన ‘పద్మవిభూషణ్’ పురస్కారాన్ని ఆయన సతీమణి, నటి హేమమాలిని స్వీకరించారు. కోర్టు హాల్లో ధర్మేంద్ర పేరు ప్రకటించగానే సభలో ఉన్న ఆయన కుమార్తె అహానా డియోల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతకుముందు హేమమాలిని మీడియాతో మాట్లాడుతూ.. “ఈ గౌరవం యావత్ దేశానికి ఆనంద క్షణం. ధర్మేంద్రజీ బతికుండగానే ఈ పురస్కారం వచ్చి ఉంటే ఆయనతో పాటు అభిమానులు మరింత సంతోషించేవారు” అని పేర్కొన్నారు. ఇదే విభాగంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు ఎన్. రాజమ్ (ఉత్తరప్రదేశ్) కూడా పద్మవిభూషణ్ అందుకున్నారు.
పద్మభూషణ్ అందుకున్న ప్రముఖులు
మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ (ప్రజావ్యవహారాలు), ప్రముఖ శతావధాని ఆర్. గణేశ్ (కళలు-కర్ణాటక), ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ (వాణిజ్యం-పరిశ్రమలు) ఈ వేడుకలో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఢిల్లీకి చెందిన ప్రజావ్యవహారాల ప్రముఖుడు దివంగత వీకే మల్హోత్రా తరఫున ఆయన కుమారుడు పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. మరోవైపు, క్రీడల విభాగంలో భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
పద్మ పురస్కారాల విజేతల పూర్తి జాబితా (2026):
పద్మవిభూషణ్ (05)
- ధర్మేంద్ర (మరణానంతరం) – కళలు (సినిమా) – మహారాష్ట్ర
- ఎన్. రాజాం – కళలు (సంగీతం/వయోలిన్) – ఉత్తరప్రదేశ్
- అచ్యుతానందన్ (మరణానంతరం) – ప్రజావ్యవహారాలు – కేరళ
- కె.టి. థామస్ – ప్రజావ్యవహారాలు/న్యాయ రంగం – కేరళ
- పి. నారాయణన్ – సాహిత్యం – కేరళ
పద్మభూషణ్ (13)
- నోరీ దత్తాత్రేయుడు – వైద్యం – అమెరికా (ఎన్ఆర్ఐ)
- మమ్ముట్టి – కళలు (సినిమా) – కేరళ
- అల్కా యాజ్ఞిక్ – కళలు (సంగీతం) – మహారాష్ట్ర
- కల్లిపట్టి రామసామి పళనిస్వామి – వైద్యం
- పీయూష్ పాండే (మరణానంతరం) – కళలు (యాడ్ రంగం) – మహారాష్ట్ర
- ఎస్కేఎం మెయిలానందన్ – సామాజిక సేవ –
- శతావధాని ఆర్. గణేశ్ – కళలు (సాహిత్యం/అవధానం) – కర్ణాటక
- శిబూ సోరెన్ (మరణానంతరం) – ప్రజావ్యవహారాలు – ఝార్ఖండ్
- ఉదయ్ కొటక్ – వాణిజ్యం-పరిశ్రమలు – మహారాష్ట్ర
- వీకే మల్హోత్రా (మరణానంతరం) – ప్రజావ్యవహారాలు – దిల్లీ
- వెల్లప్పల్లి నటేశన్ – ప్రజావ్యవహారాలు – కేరళ
- విజయ్ అమృత్‌రాజ్ – క్రీడలు (టెన్నిస్) – అమెరికా
- భగత్‌సింగ్ కోశ్యారీ – ప్రజావ్యవహారాలు – ఉత్తరాఖండ్
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్‌లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







