‘బెంగళూరు మహానగరంలో బాలక’ ఫస్ట్ లుక్ రిలీజ్
- May 26, 2026
మంత్ర మూవీ మేకర్స్, ఫాల్కన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మహి – రాజ్ ద్వయం దర్శకత్వంలో నిర్మిస్తున్న తాజా చిత్రం ‘బెంగళూరు మహానగరంలో బాలక(BMB First Look)’. ఆంధ్ర కుర్రాడు బెంగళూరు మహానగరంలో ఎదుర్కొనే కష్టాలు, సవాళ్ల నేపథ్యంలో ఒక అవుట్ అండ్ అవుట్ వినోదభరితమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల వరంగల్, హనుమకొండ పరిసర ప్రాంతాలలో ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నటుడు ప్రియదర్షి లాంచ్ చేశారు.
ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తమ్ముడు నిఖిల్ థామస్ టాలీవుడ్‌కు నటుడిగా పరిచయమవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు మల్లూ నాయక్ సినిమాటోగ్రాఫర్‌గా విజువల్స్ అందిస్తుండగా, విశ్వదీప్ అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హర్షిత్ కొటా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరికొత్త కథాంశంతో, పక్కా ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







