మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- May 27, 2026
మక్కా: సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రి మరియు సుప్రీం హజ్ కమిటీ ఛైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ మినాలో ప్రత్యేక భద్రతా దళాలు మరియు పౌర రక్షణ విభాగాల సౌకర్యాలను తనిఖీ చేసి, వాటి కార్యకలాపాలను సమీక్షించారు. ప్రత్యేక భద్రతా దళాల ప్రాంగణంలో మంత్రికి భద్రతా విభాగాధిపతి అబ్దుల్ అజీజ్ అల్-హోవైరిని స్వాగతం పలికారు.
తనపర్యటన సందర్భంగా ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ ప్రత్యేక భద్రతా దళాల కార్యాచరణ సంసిద్ధతను మరియు హజ్ సీజన్ కోసం సిద్ధం చేసిన భద్రతా ప్రణాళికలను సమీక్షించారు. హజ్ భద్రతా వ్యవస్థలో ప్రత్యేక భద్రతా దళాల అసాధారణ పనితీరును మంత్రి ప్రశంసించారు. అందుబాటులో ఉన్న అధునాతన పరికరాలతో పాటు సమీకృత భద్రత, యాత్రికులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
మినాలోని పౌర రక్షణ విభాగాల కార్యకలాపాలను కూడా మంత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అత్యవసర ప్రతిస్పందన, అత్యవసర ప్రణాళికలను ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ సమీక్షించారు. హజ్ సందర్భంగా పౌర రక్షణ విభాగం ఆధునిక సాంకేతికతలను పరిశీలించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







