ఖతార్ లో జూన్ 7 నుండి ప్రవేశ వీసాల గడువు ముగింపు..!!
- May 29, 2026
దోహా: ఖతార్ లో గడువు ముగిసిన లేదా గడువు ముగియబోతున్న అన్ని రకాల ప్రవేశ వీసాల తాత్కాలిక పొడిగింపు జూన్ 7 తో ముగియనుంది. ఈ మేరకు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. ప్రవేశ వీసాల పొడిగింపుకు సంబంధించి మార్చి 3న జారీ చేసిన మునుపటి ప్రకటనకు కొనసాగింపుగా ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంది.
జూన్ 7 తర్వాత ప్రతి వీసా విభాగానికి నిర్దేశించిన చెల్లుబాటు కాలాలు మరియు వర్తించే రుసుములతో సహా అన్ని రకాల ప్రవేశ వీసాల ప్రక్రియలు తిరిగి ప్రారంభమవుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. నివాసితులు, సందర్శకులు మరియు సంబంధిత వర్గాలందరూ తమ వీసాలను ధృవీకరించుకోవాలని కోరింది.
చట్టబద్ధమైన హోదాను కలిగి ఉండటం, నిర్దేశిత కాలపరిమితిలోగా వీసాలను పునరుద్ధరించుకోవడం, అవసరమైన రుసుములను చెల్లించడం, వీసా గడువు ముగిసిన తర్వాత దేశం విడిచి వెళ్ళిపోవడం వంటివి చేయడం ద్వారా చట్టపరమైన ఉల్లంఘనలను నివారించవచ్చని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఏపీలో స్ధానిక ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC
- మైసూరు దసరాలో వైభవంగా జంబూ సవారి..
- సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత







