డ్రైవర్లను హెచ్చరించిన కువైట్..!!
- May 29, 2026
కువైట్: కువైట్ రహదారులపై వేగ పరిమితిని ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు తన "X" ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన జారీ చేసింది. గంటకు 150 కిలోమీటర్లకు మించి వేగంతో వాహనం నడుపుతూ పట్టుబడిన పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన మరియు వాహన జప్తును ఎదుర్కొంటారని, అదే ప్రవాసులు అయితే ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తుతోపాటు దేశ బహిష్కరణను ఎదుర్కొంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
గంటకు 170 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లే పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తు మరియు వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంటామని, ప్రవాసులపై ట్రాఫిక్ ఉల్లంఘన, వాహన జప్తు మరియు దేశ బహిష్కరణ వేటు పడుతుందని తెలిపింది.
గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడిపే పౌరులకు ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం జప్తు మరియు జైలు శిక్ష విధిస్తామని, ప్రవాసులకు మాత్రం ట్రాఫిక్ ఉల్లంఘన, వాహనం జప్తు మరియు దేశ బహిష్కరణ ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







