పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానం చేసిన సీపీ సుమతి
- May 30, 2026
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆరుగురు పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ సుమతి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించారు.
పదవీ విరమణ పొందిన వారిలో ఏసీపీ (క్రైమ్స్) కె.కరుణసాగర్, కంట్రోల్ రూమ్ సబ్ ఇన్స్పెక్టర్ పి.బాలరాజు, ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టి. ప్రభాకర్, సరూర్‌నగర్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ మహమ్మద్ అలీ, అంబర్పేట్ హెడ్‌క్వార్టర్స్ ఏఆర్ఎస్ఐ ఎం. అంజిరెడ్డి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ జి. నరేందర్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సుమతి, పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లు, బాధ్యతలతో కూడుకున్నదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ క్రమశిక్షణతో, సమర్థవంతంగా సేవలందించిన అధికారులను అభినందించారు.
పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా సమయాన్ని గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే పెన్షన్, ఇతర ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటించాలని సూచిస్తూ, వారికి రావాల్సిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ (అడ్మిన్) ఇందిరా, అదనపు డీసీపీ శివకుమార్, సీఏఓ శ్రీనివాస్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ అశోక్ రెడ్డి, ఏసీపీ (స్పెషల్ బ్రాంచ్) రవీంద్ర రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రా రెడ్డి, కో-ఆపరేటివ్ సెక్రటరీ/ఏసీపీ రమేష్, ఎస్టేట్ ఆఫీసర్ నాయుడు, కో-ఆపరేటివ్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ట్రెజరర్ బాలరాజు, డైరెక్టర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







