కదిలే ఇల్లు....

- August 09, 2016 , by Maagulf
కదిలే ఇల్లు....

ఇంట్లో కూర్చుని ఉన్నప్పుడు మన ఇల్లు ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపిస్తే భూకంపం వచ్చిందనో, ఏదో ప్రమాదం జరుగు తోందనో భయపడిపోతాం. అయితే న్యూయార్క్‌లో అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ అనే ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఇంట్లో ఉంటే మాత్రం ఇల్లు కదులుతున్న అనుభూతి ప్రతి రోజు పొందాల్సిందే. గాలి ఎటు వీస్తే అటు వైపే ఇల్లు మొత్తం తిరిగేలా ఈ నిర్మాణం చేపట్టారు మరి! 2007 నుంచి కలసి పని చేస్తున్న ఆర్కి టెక్టులు ఇళ్ల నిర్మాణ రంగంలో ఆరితేరారు. విభిన్నంగా ఇళ్ల నిర్మాణాలను చేపడ తారు. వారి మెదళ్లలో నుంచి పుట్టుకువచ్చిన మరో ఆలో చనే ఈ కదిలే ఇల్లు. అంతరిక్షంలో తేలియాడే వస్తువుపై ఉంటే మనపై ఎలాంటి ప్రభావం పడు తుంది? అన్న ఊహ నుంచి పుట్టుకువచ్చిందే గాలి ఎటు వీస్తే అటు తిరిగే ఈ ఇళ్ల నిర్మాణం. న్యూయార్క్‌లోని గెంట్‌లోని ఓమి ఇంటర్నేషనల్ ఆర్ట్స్ సెంటర్‌లో అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక పెద్ద గుండ్రటి సిమెంట్ పిల్లర్‌పై 8 అడుగుల ఎత్తులో రియాక్టర్ అనే ఈ ఇంటిని వారు నిర్మించారు. ఈ ఇంటి మరో ప్రత్యేకత ఏమిటంటే, మనం అందులో నడుస్తు ంటే మన శరీర బరువుకు తగినట్లుగా ఇల్లు కూడా వంగిపోతుంది. ఈ ఇంట్లో అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ ఐదు రోజులు నివాసం కూడా ఉన్నారు. ఈ ఇంటిని చూసేందుకు వచ్చిన వారికి ఇంట్లో తాము పొందిన అనుభవాలను తెలిపారు. కదిలే ఈ ఇంటిని రెండు ఏళ్ల పాటు ప్రదర్శనకు ఉంచాలని చూస్తున్నారు. వచ్చే రెండు నెలలు అలెక్స్ షెవెదర్, వార్డ్ షెల్లీ కొన్ని రోజులు ఈ ఇంట్లో బస చేస్తారట

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com