కీసర పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన మల్కాజ్‌గిరి సీపీ సుమతి
- June 01, 2026
కీసర: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ సోమవారం కీసర పోలీస్ స్టేషన్‌ను సందర్శించి స్టేషన్ పనితీరు, సౌకర్యాలు, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరు, రికార్డుల నిర్వహణ, వివిధ విభాగాల కార్యకలాపాలు, సిబ్బందికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం క్రైమ్ విభాగం, రిసెప్షన్‌తో పాటు ఇతర విభాగాల సిబ్బందితో మాట్లాడి వారి విధుల నిర్వహణపై అవగాహనను పరిశీలించారు.
ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించాలని సీపీ సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని పరిశుభ్రత, పచ్చదనాన్ని పరిశీలించిన ఆమె, నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.
విభాగాల ఇన్‌చార్జిలు, స్టేషన్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో విధుల నిర్వహణలో మరింత చురుకుదనం ప్రదర్శించాలని ఆదేశించారు. అలాగే సాంకేతిక యాప్‌ల వినియోగం, ఎన్‌పీడీఎస్ కేసుల దర్యాప్తు, ‘మీ సురక్ష’ (Mee Suraksha) అప్లికేషన్‌లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రజలకు సురక్షితమైన, పారదర్శకమైన, సమర్థవంతమైన పోలీసు సేవలు అందించే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ సుమతి సూచించారు.
ఈ కార్యక్రమంలో కీసర ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు, ఎస్‌ఐలు మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







