బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- June 01, 2026
మనామా: జూన్ 2న వరల్డ్ హీట్ రెస్పాన్స్ డే నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పొంచి ఉన్న ప్రమాదాల గురించి ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. బహ్రెయిన్‌లో ఇటీవలి గరిష్ట ఉష్ణోగ్రతలు 49.6°Cకి చేరడంతో ఈ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనకరమైన తీవ్రమైన వేడి వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలను ఈ వార్షిక దినోత్సవం హైలైట్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2000-2019 అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,89,000 మంది వేడి సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు.
"వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీనివల్ల వేడి సంబంధిత అనారోగ్యాలు ప్రజారోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్యగా మారుతున్నాయి." అని బహ్రెయిన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (BRCS) ఆరోగ్య అవగాహన కమిటీ అధిపతి మరియు బహ్రెయిన్ విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసిన అధ్యాపకురాలు ముయస్సర్ అవధల్లా అన్నారు. నివారణే ఉత్తమ రక్షణ అని అవధల్లా పునరుద్ఘాటించారు. క్రమం తప్పకుండా నీరు తాగాలని, తీవ్రమైన వేడి సమయాల్లో బయట కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, నీడ ఉన్న లేదా ఎయిర్ కండిషన్ ఉన్న ప్రదేశాలలో సేద తీరాలని, తేలికపాటి దుస్తులు ధరించడంతోపాటు తరచుగా విరామం తీసుకోవడం వంటివి వడదెబ్బ మరియు వడఘాత ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని తెలిపారు.
పిల్లలు, వృద్ధులు మరియు మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో జీవిస్తున్న వారు ఎక్కువగా ఈ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పారు. అధికంగా చెమట పట్టడం, అలసట, తల తిరగడం, తలనొప్పి, వికారం మరియు కండరాల నొప్పులు వంటివి దీని ప్రారంభ హెచ్చరిక సంకేతాలని వివరించారు.
అవగాహన కార్యక్రమాలలో భాగంగా, BRCS ఇటీవల అల్-మల్కియా స్పోర్ట్స్ క్లబ్ అకాడమీకి చెందిన 12 ఏళ్లలోపు మరియు 14 ఏళ్లలోపు క్రీడాకారుల కోసం వేడి నుండి రక్షణపై ఒక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలు, వ్యవసాయ పర్యావరణ బృందం అధిపతి డాక్టర్ నిలోవర్ జహ్రోమి నేతృత్వంలో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో వేడి సంబంధిత అనారోగ్యాలను గుర్తించడం మరియు క్రీడా కార్యకలాపాల సమయంలో సురక్షితమైన పద్ధతులను పాటించడంపై అవగాహన కల్పించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







