అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- June 01, 2026
దోహా: అల్ ఖోర్ మరియు అల్ తఖిరా మునిసిపాలిటీల ప్రాతినిధ్యంతో ఈద్ అల్-అధా వేడుకలలో భాగంగా అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఖతార్‌లో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛగా ఎగిరే చిలుకల ప్రదర్శనను(ఫ్రీ ఫ్లైట్ పారట్) ఖతార్ మునిసిపాలిటీల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఇది సందర్శకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతి అందిస్తుందని తెలిపింది.
ఈ ప్రదర్శనలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన “లాండర్ వరల్డ్ ప్యారెట్స్” బృందం పాల్గొంటుంది. వారి శిక్షణ పొందిన చిలుకలు బహిరంగ వాతావరణంలో గగన విన్యాసాలు మరియు ఇంటరాక్టివ్ విన్యాసాలను ప్రదర్శించారు. ఖతార్‌లో ఇటువంటి స్వేచ్ఛగా ఎగిరే పక్షుల ప్రదర్శన జరగడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.
ఇది అన్ని వయసుల సందర్శకులను ఆకట్టుకునే వినూత్న కార్యకలాపాలను పరిచయం చేయడం ద్వారా ఈద్ సెలవుల అనుభవాన్ని సుసంపన్నం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







