బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!

- June 08, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రభుత్వ సేవలకు ఒకే యాప్..!!

మనామా: బహ్రెయిన్ లో డిజిటల్ పరివర్తన వ్యూహంలో భాగంగా గతంలో “ఇస్లామియత్” మొబైల్ అప్లికేషన్‌లో అందుబాటులో ఉన్న సేవలను  “మైగవ్” యాప్‌కు పూర్తిగా తరలించినట్లు ఇన్ఫర్మేషన్ , ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA) ప్రకటించింది. ప్రజా సేవలను తక్కువ సంఖ్యలోకి తీసుకురావడం,వినియోగదారు అనుభవాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలో ఈ మార్పు ఒక భాగమన్నారు. “మైగవ్” యాప్, bahrain.bh/apps ద్వారా బహ్రెయిన్ ఇ-గవర్నమెంట్ యాప్స్ స్టోర్‌లో ప్రజలకు అందుబాటులో ఉందన్నారు.

సరళీకృత డిజిటల్ సేవల దిశగా ముందడుగు
ఇన్ఫర్మేషన్ & ఇ-గవర్నమెంట్ అథారిటీ (iGA)లో ఇ-ట్రాన్స్‌ఫర్మేషన్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్  అలీ అబ్దుల్ అజీజ్ జనాహి మాట్లాడుతూ.. డిజిటల్ ఛానెల్స్ ద్వారా ప్రభుత్వ సేవలను మరింత సౌకర్యవంతంగా మరియు వినియోగదారు-స్నేహపూర్వకంగా మార్చడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలకు తాజా మార్పులు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వ సేవలన్నింటిలో డిజిటల్ పరివర్తనను మెరుగుపరచడానికి మరియు మల్టీ అప్లికేషన్లను తగ్గించడానికి బహ్రెయిన్ అనుసరిస్తున్న విస్తృత వ్యూహానికి ఈ మార్పు మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.

ప్రభుత్వ యాప్ ల విలీనం
అంతర్గత వ్యవహారాల మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అధ్యక్షతన ఉన్న సమాచార మరియు ప్రసార సాంకేతిక మంత్రివర్గ కమిటీ పర్యవేక్షణలో వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమం అమలు చేయబడుతోందని అలీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ అప్లికేషన్లను మూడు ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లుగా మార్చడమే ఈ ప్రణాళిక లక్ష్యమన్నారు. వ్యక్తుల కోసం మైగవ్ (MyGov), వ్యాపారాలు మరియు పెట్టుబడిదారుల కోసం అల్తాజిర్ (AlTajir),  సందర్శకుల కోసం బహ్రెయిన్ (Bahrain) యాప్ లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

మైగవ్ సేవల విస్తరణ
ప్రజా ప్రాధాన్యతలకు అనుగుణంగా మరిన్ని సేవలను జోడించడం ద్వారా "మైగవ్" ప్లాట్‌ఫారమ్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బహ్రెయిన్‌లో ప్రభుత్వ సేవలకు ఈ యాప్‌ను ప్రాథమిక డిజిటల్ గేట్‌వేగా నిలపడమే లక్ష్యమమన్నారు. దీని కారణంగా ఆన్‌లైన్‌లో ప్రభుత్వ సేవలను పొందేటప్పుడు వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవం లభిస్తుందని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com