నిర్మాతగా నాగచైతన్య..కీలక పాత్రలో కనిపించనున్న భూమిక చావ్లా
- June 09, 2026
అక్కినేని నాగచైతన్య కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న దూత-2 పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా అధికారికంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎనిమిదేళ్ల తర్వాత క్రేజీ కాంబో!
ఈ సిరీస్ ద్వారా నాగచైతన్య సరికొత్తగా నిర్మాత అవతారమెత్తడం విశేషం. చైతన్య స్వయంగా నిర్మిస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇదే కావడంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సెకండ్ సీజన్‌కు కూడా ఫస్ట్ సీజన్ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్‌ను కూడా మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిస్తున్నారు.
ఫస్ట్ సీజన్లో కీలక పాత్రల్లో మెరిసిన పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్ ఈసారి కూడా అలరించనున్నారు. అయితే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్రముఖ నటి భూమిక చావ్లా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. గతంలో నాగచైతన్య, భూమిక కలిసి ‘సవ్యసాచి’ (2018) చిత్రంలో నటించారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!









