హిజ్రీ నూతన సంవత్సర సెలవు తేదీలను ప్రకటించిన కువైట్ కేబినెట్..!!

- June 11, 2026 , by Maagulf
హిజ్రీ నూతన సంవత్సర సెలవు తేదీలను ప్రకటించిన కువైట్ కేబినెట్..!!

కువైట్: హిజ్రీ నూతన సంవత్సరం (1448 AH) కోసం అధికారిక సెలవు తేదీలను ఆపద్ధర్మ ప్రధాన మంత్రి మరియు అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ యూసెఫ్ సౌద్ అల్-సబా అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ప్రకటించింది. ఒకవేళ దుల్-హిజ్జా నెల 29 రోజులు ఉంటే, జూన్ 16 (మంగళవారం )నాడు అధికారిక సెలవు దినంగా ఉంటుంది.  జూన్ 17 (బుధవారం) నాడు ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి పనిచేయడం ప్రారంభిస్తాయి.
ఒకవేళ దుల్-హిజ్జా నెల 30 రోజులు ఉంటే, జూన్ 17 (బుధవారం) అధికారిక సెలవు దినంగా ఉంటుంది. అలాగే జూన్ 18 (గురువారం) రెండు సెలవు దినాల మధ్య విశ్రాంతి దినంగా పరిగణించబడుతుంది. ఆ సందర్భంలో, జూన్ 21 (ఆదివారం) నాడు అధికారిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయి.
ఈ నిర్ణయం అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా సంస్థలు మరియు ఇతర సంస్థలకు వర్తిస్తుంది.  అయితే, ప్రత్యేక పని అవసరాలు కలిగిన సంస్థలు ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా తమ సొంత సెలవు షెడ్యూల్‌లను నిర్ణయించుకుంటాయి. అలాగే, ఇస్లామిక్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కువైట్ అమీర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబా, క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్-ఖలీద్ అల్-హమద్ అల్-సబా, కువైట్ ప్రజలు మరియు అక్కడి నివాసితులకు మంత్రివర్గం తన శుభాకాంక్షలను తెలియజేసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com