పేటెంట్ పరిశీలనపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన MOCI..!!
- June 11, 2026
దోహా: GCC ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ (IP) శిక్షణా కేంద్రంతో కలిసి పేటెంట్ పరిశీలనపై ఒక అధునాతన శిక్షణా కార్యక్రమాన్ని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MOCI), నిర్వహించింది. MOCI మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ విభాగం నుండి పలువురు పేటెంట్ పరిశీలకులు ఈ రెండు రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యాధునిక అంతర్జాతీయ పద్ధతులను ప్రదర్శించడం, పరిశీలన విధానాలకు సంబంధించిన నైపుణ్యాన్ని పంచుకోవడం మరియు పేటెంట్లను పరిశీలించడంలో వారి సాంకేతిక మరియు చట్టపరమైన పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
మొత్తంగా, పేటెంట్ల నిష్పాక్షిక పరిశీలన, వర్గీకరణ, అలాగే మేధో సంపత్తికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు మరియు విధానాలు వంటి వృత్తిపరమైన అంశాల ఆధారంగా ఈ కార్యక్రమం రూపొందించారు. అలాగే, పేటెంట్ దరఖాస్తుల పరిశీలన మరియు నిర్వహణలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వ్యవస్థలు మరియు పరిశీలన ప్రక్రియలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగంపై కూడా దృష్టి సారించారు. జాతీయ సామర్థ్యాలు, మేధో సంపత్తి వ్యవస్థ మరియు ఆవిష్కరణలను పెంపొందించడానికి జరుగుతున్న కృషిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







