ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- June 11, 2026
భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా తమిళ సినిమాకు సరికొత్త నడకను, నడకను నేర్పిన లెజెండరీ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) అంతిమ సంస్కారాలు ముగిశాయి. నిన్న ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచినప్పుడు సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చి కన్నీటి నివాళులు అర్పించారు. చిత్రసీమలో ఒక శకానికి ముగింపు పలికిన ఆయన భౌతికకాయాన్ని చూసి సహచర నటీనటులు, సాంకేతిక నిపుణులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గ్రామీణ నేపథ్య కథలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన ఈ మహానుభావుడి మృతి సినీ రంగానికి తీరని లోటని పలువురు కొనియాడారు.
చెన్నైలో నివాళుల అనంతరం, భారతీరాజా పార్థివదేహాన్ని ఆయన స్వస్థలమైన దిండిగల్ జిల్లా, వత్తలగుండు ఘాట్రోడ్డులోని స్వంత వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. తన మట్టిని, గ్రామీణ సంస్కృతిని అమితంగా ప్రేమించే ఆయన చివరి కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. తమ ప్రియతమ దర్శకుడిని చివరిసారి చూసేందుకు వత్తలగుండుకు వేలాదిగా అభిమానులు, స్థానిక ప్రజలు తరలివచ్చారు. చలనచిత్ర రంగానికి ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పోలీసుల గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించిన అనంతరం, కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







