దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- June 11, 2026
అమరావతి: విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే యువతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) శుభవార్త తెలిపింది. దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు చెల్లుబాటు అయ్యే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పేర్కొంది. అభ్యర్థుల ఎంపిక డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.
గమనిక: జిల్లాల వారీగా ఇంటర్వ్యూల తేదీలను ప్రత్యేకంగా నిర్ణయించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ జిల్లాకు సంబంధించిన ఇంటర్వ్యూ తేదీ, వేదిక వివరాలను అధికారిక వెబ్సైట్ లేదా సంబంధిత అధికారుల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు AED 4,000 నుంచి AED 5,000 వరకు వేతనం లభించే అవకాశం ఉందని, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.1,04,000 వేల నుంచి రూ.1,30,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
అలాగే ఉచిత వీసా, విమాన టికెట్, లైసెన్స్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. లైసెన్స్ పొందే వరకు నెలకు AED 500 అలవెన్స్ కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ జూన్ 28, 2026 కాగా, ఇంటర్వ్యూలు జూన్ 29, 2026న నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆసక్తి గల అభ్యర్థులు http://naipunyam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9988533325, 8712655686, 8790118349, 8790117279 నంబర్లను సంప్రదించవచ్చని ఏపీఎస్ఎస్డీసీ అధికారులు తెలిపారు.
విదేశీ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !
- ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
- తిరుమలలో 32 ఉచిత ఈవీ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే తొలి మెట్రో-టు-రెసిడెన్షియల్ స్కైవాక్
- గాజా సిటీలో విషాదం..భవనం కూలి 16 మంది మృతి
- అబుదాబిలో మూడు ఘటనలు..కార్ల ఢీకొనడంతో పాదచారులకు గాయాలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ నాలుగో కారిడార్







