క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- June 12, 2026
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) గుడ్ న్యూస్ చెప్పింది. 2027లో జరగబోయే పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన కీలక అప్డేట్ను అందించింది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు జరగనుందని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ ‘ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో’ వెల్లడించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమిస్తున్నాయి. కాగా, 2003 తర్వాత మళ్లీ ఆఫ్రికా ఖండంలో వన్డే వరల్డ్ కప్ జరగనుండటం ఇదే తొలిసారి.
సింహభాగం మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలోనే!
తాజా సమాచారం ప్రకారం, ఈ టోర్నీలో నిర్వహించే మొత్తం 54 మ్యాచ్‌లలో అత్యధిక శాతానికి దక్షిణాఫ్రికానే వేదిక కానుంది. దాదాపు 41 మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా మైదానాల్లోనే జరగనున్నాయి. జింబాబ్వే మూడు ప్రధాన వేదికలలో 8 నుండి 10 మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఇందుకోసం విక్టోరియా ఫాల్స్ వద్ద ‘ఫేల్ మోసీ-ఓ-తున్యా’ అనే కొత్త స్టేడియాన్ని ఈ ఏడాది చివరికల్లా సిద్ధం చేస్తున్నారు. నమీబియా: మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
ICC World Cup 2027: పాత ఫార్మాట్ రీ-ఎంట్రీ.. 14 జట్ల మధ్య పోటీ
గత రెండు ప్రపంచకప్‌లలో కేవలం 10 జట్లే తలపడగా, 2027 ఎడిషన్‌లో ఐసీసీ పాత ఫార్మాట్‌ను తిరిగి తీసుకువస్తోంది. ఈసారి మొత్తం 14 జట్లు టైటిల్ కోసం రేసులో నిలవనున్నాయి. వీటిని ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. లీగ్ దశ ముగిసిన తర్వాత ప్రతి గ్రూప్ నుండి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ‘సూపర్ సిక్స్’ రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఫుల్-మెంబర్ హోదా ఉన్నందున దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా టోర్నీకి క్వాలిఫై అవ్వగా.. నమీబియా మాత్రం అర్హత పోరాటం (Qualifying Rounds) ద్వారా రావాల్సి ఉంటుంది.
ఐసీసీ వార్షిక సమావేశంలో తుది ముద్ర
2027-2031 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (FTP) సైకిల్లో జరగబోయే మొట్టమొదటి ఐసీసీ ఈవెంట్ ఇదే. మే నెలలో అహ్మదాబాద్‌లో జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో ఈ షెడ్యూల్‌పై ప్రాథమిక చర్చలు జరగ్గా.. జులైలో ఎడిన్బర్గ్లో నిర్వహించబోయే వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) దీనికి అధికారిక ఆమోదం లభించనుంది. ఈ సమావేశంలోనే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫార్మాట్లో మార్పులు, అన్ని దేశాలను అందులో చేర్చడంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







