మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- June 12, 2026
మెటా ప్లాట్‌ఫార్మ్స్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సేవలు శుక్రవారం స్వల్పకాలం అంతరాయానికి గురైన అనంతరం తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలను వినియోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి.
అవుటేజ్‌లను పర్యవేక్షించే ప్రముఖ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ (http://Downdetector.com) ప్రకారం, అంతరాయం గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో ఫేస్‌బుక్‌కు సంబంధించి 1.13 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ సేవల్లో సమస్యలపై దాదాపు 10 వేల నివేదికలు అందాయి.
ఈ సమస్యపై స్పందించిన మెటా ప్రతినిధి, సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు సంస్థ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. అనంతరం సేవలను విజయవంతంగా పునరుద్ధరించినట్లు సమాచారం.
సాంకేతిక సమస్య కారణంగా కొంతకాలం లాగిన్, ఫీడ్ అప్డేట్లు, కంటెంట్ యాక్సెస్‌లో అంతరాయం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం సేవలు సాధారణంగా పనిచేస్తున్నాయని వినియోగదారులు వెల్లడించారు.
కాగా, ఈ అంతరాయం వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలను మెటా సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడటంతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ, ఫ్రాన్స్ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు
- టాలెంట్ డెవలప్మెంట్లో దుబాయ్ పోలీసులకు మిడిల్ ఈస్ట్ ఎక్సలెన్స్ అవార్డు
- 2027 నుంచి దుబాయ్‌లో డెలివరీ బైక్‌లకు స్మార్ట్ మానిటరింగ్ తప్పనిసరి
- ఈడీ మెరుపు దాడులు..రూ.1,500 కోట్ల మనీలాండరింగ్ గుట్టురట్టు
- డాలస్ లో వైభంవగా కొసరాజు సాహిత్యావిష్కరణ
- భారత్–యూఏఈ ఆవిష్కరణ రంగంలో కొత్త అడుగు..
- బాంబు బెదిరింపుల వేళ.. బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్‌తో కనిపించిన అమితాబ్
- హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర ప్రారంభం
- బహ్రెయిన్‌లో ప్రవాసులకు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ నిబంధనలు..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ రూల్స్..!!







