65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- June 13, 2026
హైదరాబాద్: పోలీసు సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్‌ను తెలంగాణ డీజీపీ సి.వి.ఆనంద్ శుక్రవారం సందర్శించి సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మెస్ ప్రాంగణాన్ని మొత్తం పరిశీలించిన డీజీపీ, అక్కడి మౌలిక సదుపాయాలు, నిర్వహణ విధానం, సిబ్బంది అవసరాలపై అధికారులతో చర్చించారు. మెస్‌లోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలిస్తూ ఆధునికీకరణ చర్యల పై సూచనలు చేశారు.
పోలీసు అధికారుల అవసరాలకు అనుగుణంగా మెస్‌ను మరింత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించిన డీజీపీ, భవన నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అలాగే, పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ స్థలాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెస్ నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు హెచ్‌ఆర్‌ఎన్‌ఎస్ (HRNS) పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలీసు అధికారుల సంక్షేమం, సౌకర్యాల మెరుగుదల పోలీసు శాఖ ప్రాధాన్య అంశాల్లో ఒకటని డీజీపీ పేర్కొన్నారు.చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ మెస్‌ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







