స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!
- June 13, 2026
టోలెడో(స్పెయిన్): పర్యాటక రంగం స్థిరత్వాన్ని పెంచడానికి బలమైన ప్రపంచ సహకారం అవసరమని సౌదీ అరేబియా పర్యాటక శాఖ మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ పిలుపునిచ్చారు.జూన్ 10 నుండి 11 వరకు స్పెయిన్‌లోని టోలెడోలో జరిగిన ఐక్యరాజ్యసమితి పర్యాటక కార్యనిర్వాహక మండలి 126వ సమావేశంలో అల్-ఖతీబ్ పాల్గొని మాట్లాడారు.ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ పర్యాటక పరిశ్రమ పరిస్థితులకు అనుగుణంగా కోలుకోవడంలో బలమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉందని అన్నారు.
ప్రపంచ పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అంతర్జాతీయ సహకారం బలంగా ఉండాలన్నారు. ఐరాస పర్యాటక శాఖ మరియు సభ్య దేశాలతో సౌదీ అరేబియా తన భాగస్వామ్యాలకు కట్టుబడి ఉంటుందని మంత్రి పునరుద్ఘాటించారు. గత సంవత్సరం రియాద్‌లో జరిగిన ఐరాస పర్యాటక సర్వసభ్య సమావేశం ఫలితాలను ప్రస్తావించారు. భవిష్యత్ సవాళ్లకు పర్యాటక రంగాన్ని సిద్ధం చేసే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలను ఆచరణలోకి తీసుకురావాలని అల్-ఖతీబ్ పిలుపునిచ్చారు.
సౌదీ ప్రతినిధి బృందం పర్యాటక రంగ కార్మిక శక్తి అభివృద్ధి, పెట్టుబడి, సుస్థిర పర్యాటకం, ఆవిష్కరణ, సాంకేతికత, డేటా మరియు స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్స్ మరియు గమ్యస్థాన మార్కెటింగ్ వంటి అంశాలను కవర్ చేస్తూ ఫ్రాన్స్‌తో ఒక ఉమ్మడి కార్య ప్రణాళికపై సంతకం చేసింది. అలాగే, భవిష్యత్ సహకారం మరియు ఉమ్మడి కార్యక్రమాల కోసం అవకాశాలను వెతకడానికి ఇండోనేషియా, స్పెయిన్ మరియు ఈజిప్ట్ దేశాల పర్యాటక అధికారులతో అల్-ఖతీబ్ సమావేశమై చర్చించారు.
తాజా వార్తలు
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!
- స్థిరమైన పర్యాటకానికి బలమైన ప్రపంచ సహకారం కోసం సౌదీ పిలుపు..!!
- మొహర్రంకు ముందు హుస్సేనియా ప్రతినిధులతో సమావేశం..!!









