ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- June 16, 2026
మస్కట్: వ్యాపారాలు మరియు కీలక ఆర్థిక రంగాలపై ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావాన్ని తగ్గించే లక్ష్యంతో ఒమన్ సుల్తానేట్ సహాయక చర్యల ప్యాకేజీని ప్రవేశపెట్టిందని ప్రభుత్వ కమ్యూనికేషన్ సెంటర్ ప్రకటించింది. దేశీయ ఆర్థిక స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం, ప్రపంచ పరిణామాల నుండి ఒత్తిళ్లను తగ్గించడం, కీలకమైన సఫ్లై చైన్ మరియు ఆహార భద్రతను పరిరక్షించడం కోసం ప్రభుత్వం చేస్తున్న సమగ్ర ప్రయత్నంలో భాగంగా ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపింది.
ప్రాథమిక చర్యలలో భాగంగా ఆహార భద్రతా సంస్థలకు విద్యుత్ టారిఫ్‌లను స్థిరీకరించనున్నారు. డిసెంబర్ 2026 వరకు వినియోగ పరిమాణాలతో సంబంధం లేకుండా కిలోవాట్-గంటకు 12 బైసాలకు పరిమితం చేస్తారు. దీంతోపాటు జాతీయ ఆహార సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, భారతీయ ఓడరేవుల నుండి దిగుమతి చేసుకున్న ఆహార వస్తువుల సముద్ర రవాణాకు ఆరు నెలల పాటు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఆమోదించింది.
నిర్మాణ మరియు పర్యాటక పరిశ్రమలకు సహాయపడటానికి, రీబార్ స్టీల్ దిగుమతులపై కస్టమ్స్ సుంకాలు సంవత్సరాంతం వరకు 5 శాతంగా స్థిరంగా కొనసాగించనున్నారు. అలాగే, ఆతిథ్య సంస్థల నుండి 4 శాతం పర్యాటక సుంకం వసూలును మూడు నెలల పాటు వాయిదా వేయనున్నారు. చిన్న మరియు మధ్య తరహా సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రుణ వాయిదాలను వాయిదా వేసే సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









