జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- June 18, 2026
దోహా: జాయింట్ భద్రతా ప్రాజెక్టులకు సంబంధించిన డేటా, సమాచార రక్షణను బలోపేతం చేసేందుకు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఖతర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం (MOU) కుదిరింది.
యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ ఖలీఫా హారిబ్ అల్ ఖైలి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఖతర్‌ను అధికారికంగా సందర్శించిన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఖతర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా బిన్ ఖలఫ్ బిన్ హత్తాబ్ అల్ కాబీ యూఏఈ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు.
ఈ అవగాహన ఒప్పందం రెండు దేశాల మధ్య అమలవుతున్న ఆరు కీలక ఉమ్మడి భద్రతా ప్రాజెక్టులను కవర్ చేస్తుంది. వీటిలో నెట్‌వర్క్ అనుసంధానం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన ద్వైపాక్షిక ఎలక్ట్రానిక్ లింకేజ్ వ్యవస్థ, ట్రాఫిక్ వ్యవస్థల అనుసంధానం, ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన ఆర్థిక మొత్తాల బదిలీ మరియు వసూళ్లు, అలాగే దేశ బహిష్కరణకు గురైన వ్యక్తుల వివరాలు, వేలిముద్రలు మరియు గుర్తుతెలియని వేలిముద్రల ఎలక్ట్రానిక్ మార్పిడి వంటి అంశాలు ఉన్నాయి.
రెండు సోదర దేశాల మధ్య భద్రతా సహకారం, సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల భద్రతా సమాచార మార్పిడి, అనుభవాల పంచుకోవడం మరింత సమర్థవంతంగా మారడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
అంతేకాకుండా ఉమ్మడి భద్రతా సహకార వ్యవస్థను మరింత అభివృద్ధి చేయడం, రెండు దేశాల భద్రతా సేవలు మరియు ప్రాజెక్టుల మధ్య సమగ్రతను పెంచడం కూడా ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించారు.
ఈ ఎంఓయూ ద్వారా యూఏఈ–ఖతర్ సంబంధాలు మరింత బలపడటంతో పాటు ప్రాంతీయ భద్రతా సహకారంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







