ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- June 24, 2026
రియాద్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియ నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐల ఓటు హక్కులను పరిరక్షించాలని సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) అధ్యక్షుడు శ్రీనివాస్ మచ్చా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు తమ స్వస్థలాల అభివృద్ధికి, రాష్ట్రాల ఆర్థిక ప్రగతికి విశేషంగా దోహదపడుతున్నారని తెలిపారు. అలాంటి ఎన్ఆర్ఐల ప్రజాస్వామ్య హక్కులను, ముఖ్యంగా ఓటు హక్కును కాపాడేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
విదేశాల్లో ఉన్న ఓటర్లకు ఓటరు నమోదు, వివరాల సవరణ, ఇతర ఎన్నికల సేవలు సులభంగా అందుబాటులో ఉండేలా ఆన్లైన్ సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాలను కోరారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర కీలకమని పేర్కొన్న శ్రీనివాస్ మచ్చా, వారి సమస్యలను ప్రభుత్వాలు సానుకూలంగా పరిగణించి తగిన పరిష్కారాలు చూపాలని అన్నారు. ఎన్ఆర్ఐల ఓటు హక్కులు ఎలాంటి కారణాలతోనూ కోల్పోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా, అది జూలై 14 వరకు కొనసాగనుంది. తెలంగాణలో జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ జూలై 24 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న తెలుగు ఓటర్లు తమ వివరాలను సకాలంలో నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని SATA పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







