భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో బురఖా ధారణపై త్వరలో నిషేధం
- August 11, 2016
భద్రత దృష్ట్యా ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఉగ్రవాద దాడులు ఆగడం లేదు. ఒంటరి తోడేళ్ళు, కారు బాంబులు, భారీ లారీల రూపంలో అపర మృత్యు దేవతలుగా ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. అందుకే జర్మనీ ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ నిర్ణయం వివాదాస్పదం అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. భద్రత కోసం జర్మనీ హోం మంత్రి అనేక చర్యలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగానే బురఖా ధరించి బహిరంగ ప్రదేశాల్లో సంచరించడాన్ని నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు. వచ్చే వారం ఈ ప్రతిపాదనను ప్రకటిస్తారని తెలుస్తోంది. బురఖాతో మహిళ ముఖాన్ని పూర్తిగా కప్పుకుని బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై నిషేధం విధించే ప్రతిపాదనను ఏంజెలా మెర్కెల్ ప్రభుత్వంలోని చాలా మంది సీనియర్ మంత్రులు సమర్థిస్తున్నారు. ఉగ్రవాద చర్యలను, హింసను ప్రేరేపించే ఇస్లామిక్ బోధకులను దేశం నుంచి బహిష్కరించాలని కూడా ప్రతిపాదించారు. బహిరంగ ప్రదేశాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేయడం కోసం భద్రతా బలగాలను అదనంగా నియమించుకోవాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







