ఇక బాంగ్లాదేశ్ వాళ్ళు కూడా సౌదీ లో పని చేయచ్చు
- August 11, 2016
బంగ్లాదేశ్ విషయంలో సౌదీ అరేబియా మనసు మార్చుకుంది. ఆ దేశం నుంచి ఎవరినీ పనిలోకి తీసుకోకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. గత ఆరేళ్లుగా కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఎత్తేసినట్లు ఢాకా అధికార ప్రతినిధి గులామ్ మోషి చెప్పారు. గత జూన్ నెలలో తమ దేశ ప్రధాని షేక్ హసీనా, సౌదీ రాజు సల్మాన్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని, దాని ప్రకారమే తాజాగా నిషేధాన్ని ఎత్తివేశారని చెప్పారు.దీంతో తమ దేశం నుంచి నైపుణ్యంగల ఉద్యోగులు, నైపుణ్యం లేని శ్రామికులు సౌదీలో పనిచేసేందుకు వీలైందని పేర్కొన్నారు. వైద్యులు, నర్సులు, ఉపాధ్యాయులు, వ్యవసాయం చేసేవాళ్లు, భవన నిర్మాణ కార్మికులు ఇక ఉపాధి కోసం సౌదీకి వెళ్లవచ్చని అన్నారు. ఇప్పటికే మొత్తం 48 రంగాల్లో తమ దేశం నుంచి అక్కడ పనిచేసేందుకు తమ వాళ్లు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







