చైనాలో స్టీమ్ పైప్ పేలి 21 మంది మృతి
- August 11, 2016
చైనాలో భారీ పేలుడు కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ చైనాలోని హుబై ప్రావిన్స్‌లో ఒత్తిడి ఎక్కువై స్టీమ్ పైపు పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రావిన్స్‌లోని దన్యాంగ్ నగరంలోని పవర్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో 21 మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కాలంలో చైనాలో పరిశ్రమల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గత ఏడాది తియాంజిన్ నగరంలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించి 173 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







