సౌదీ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇక పై పక్కా నిఘా

- June 28, 2026 , by Maagulf
సౌదీ ఎయిర్‌పోర్ట్స్‌లో ఇక పై పక్కా నిఘా

సౌదీ అరేబియా: భారత్ సహా గల్ఫ్ దేశాల మధ్య ప్రయాణించే వారికి, ముఖ్యంగా బంగారం, నగదు తీసుకెళ్లే ప్రయాణికులకు అలర్ట్! సౌదీ అరేబియా ప్రభుత్వం తమ దేశ మనీల్యాండరింగ్ నిరోధక చట్టాన్ని (Anti-Money Laundering Law) మరింత కఠినతరం చేస్తూ అమలు నిబంధనలలో అత్యంత కీలక మార్పులు చేసింది.దీని ప్రకారం..ఆ దేశంలోకి వచ్చే లేదా అక్కడ నుంచి వెళ్లే అంతర్జాతీయ ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే విలువైన వస్తువులు, కరెన్సీ మరియు బంగారు ఆభరణాల డిక్లరేషన్ పరిమితిని (Mandatory Declaration Threshold) భారీగా తగ్గించింది.

కస్టమ్స్ పరిమితి రూ.10 లక్షలకే పరిమితం

సౌదీ అరేబియాలో ఆర్థిక నేరాలు, మనీల్యాండరింగ్ అరికట్టడమే ధ్యేయంగా ఈ సరికొత్త రిస్క్-ఆధారిత విధానాన్ని (Risk-Based Approach) తీసుకువచ్చారు.

పరిమితి తగ్గింపు: గతంలో ప్రయాణికులు తమ వెంట 60,000 సౌదీ రియాల్స్ విలువైన నగదు లేదా బంగారం ఉంటేనే డిక్లేర్ చేయాల్సి ఉండేది.ఇప్పుడా లిమిట్‌ను 40,000 సౌదీ రియాల్స్‌కు (దాదాపు రూ.10 లక్షలు) తగ్గించారు.
లిఖితపూర్వక డిక్లరేషన్ తప్పనిసరి: ఇక పై ఎవరైనా 40,000 రియాల్స్ లేదా అంతకంటే ఎక్కువ విలువైన కరెన్సీ, గోల్డ్ బిలియన్ (బంగారు బిస్కెట్లు), రత్నాలు, ఆభరణాలు లేదా బేరర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్లను తమ వెంట ఉంచుకుంటే.. ‘జకాత్, టాక్స్ అండ్ కస్టమ్స్ అథారిటీ’ (ZATCA) అధికారులకు తప్పనిసరిగా లిఖితపూర్వక కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్ సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, వాటి కొనుగోలుకు సంబంధించిన అసలు ఇన్వాయిస్/బిల్లులను కూడా చూపించాలి.

ఉల్లంఘిస్తే జప్తు, భారీ జరిమానాలు

ఈ నూతన నిబంధనలను నిర్లక్ష్యం చేసినా లేదా తప్పుడు వివరాలు వెల్లడించినా కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు:

కఠిన కస్టమ్స్ చర్యలు

72 గంటల తాత్కాలిక జప్తు: డిక్లేర్ చేయని లేదా అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను/నగదును కస్టమ్స్ అధికారులు తక్షణమే 72 గంటల పాటు తమ ఆధీనంలోకి తీసుకుంటారు.
తొలిసారి తప్పు చేస్తే: మనీల్యాండరింగ్ ఉద్దేశం లేదని తేలితే.. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువపై 10 శాతం నుండి 25 శాతం వరకు పెనాల్టీ విధిస్తారు.
రెండోసారి పునరావృతమైతే: ఈ జరిమానాను ఏకంగా 50 శాతానికి పెంచుతారు. ఒకవేళ నిధుల వెనక నేరపూరిత లేదా మనీల్యాండరింగ్ ఉద్దేశాలు ఉన్నాయని అనుమానిస్తే, ఆ కేసును నేరుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) మరియు ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ విభాగానికి బదిలీ చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com